వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ ఏర్పాటంటే అది కాదు: ప్రణబ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా సీమాంధ్ర కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు శుక్రవారం ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ఆ సమయంలో వారిపై ప్రణబ్ చిరాకు పడ్డారు. తెలంగాణ విషయంలో కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చేసిన ప్రకటనలో కొత్త విషయమేమీ లేదని, యుపిఎ ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికలో, రాష్ట్రపతి ప్రసంగంలో చెప్పిన విషయాన్నే చిదంబరం చెప్పారని ఆయన వివరించారు. వాటిని చదివి వినిపించారు. ఇప్పుడేం కొంపలు మునిగాయని ఆందోళన చెందుతున్నారని ఆయన అడిగారు. తెలంగాణ తీర్మానం పెడితే మద్దతిస్తామన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మాట మారుస్తున్నారని, చంద్రబాబు ద్వంద్వ వైఖరిని ఎండగట్టడానికి బదులు ఇలా చేయడం సరి కాదని ఆయన వారితో అన్నారు.