రామోజీ రావు తెలంగాణ జపం?

నిజానికి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావుకు రామోజీ ఎప్పుడో మద్దతు పలికినట్లు చెబుతున్నారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి, తెరాసకు మధ్య పొత్తు కుదర్చింది కూడా ఆయన అంటారు. ఇటీవల అసైన్డ్ భూముల ఆక్రమణ వివాదం ముందుకు వచ్చినప్పుడు రామోజీకి మద్దతుగా కెసిఆర్ మాట్లాడారు. రామోజీ ఫిల్స్ సిటీని కూడా కెసిఆర్ నిరాహార దీక్షకు ముందు మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రశంసించారు. ఎంతో శ్రమకోర్చిన ప్రపంచ ప్రశంసలందుకునే రీతిలో రామోజీ దాన్ని నిర్మించారని కెసిఆర్ అన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆసైన్డ్ భూములున్నాయని తాను అనలేదని, ఫిల్స్ సిటీని నాగళ్లతో దున్నుతామని తాను అనలేదని కెసిఆర్ వివరణ ఇచ్చుకున్నారు.












Click it and Unblock the Notifications