జబ్రాల్టర్ సుందరి ఈసారి ప్రపంచ సుందరి కిరీటం ఎత్తుకుపోయింది. మిస్ జిబ్రాల్టర్ కియానే ఆల్డోరినో 2009 సంవత్సరానికి గాను ఈ అవార్డును గెలుచుకుంది. 22 ఏళ్ల కియానే హెచ్‌ఆర్ శాఖలో క్లర్కుగా పనిచేస్తోంది. మిస్ ఇండియా వరల్డ్ పూజా చోప్రా సహా మొత్తం 112 దేశాల సుందరీమణులు పాల్గొన్న ఈ పోటీలో 111 మంది సుందరీమణులని తలదన్ని ఈమె ఈ టైటిల్ గెలుచుకుంది. రెండోస్థానంలో మిస్ మెక్సికో పెర్లా బెల్ట్రాన్, మూడో స్థానంలో మిస్ దక్షిణాఫ్రికా టటుమ్ కెష్వర్ నిలిచారు. చివరి రౌండులో ఏడుగురు పోటీపడ్డారు. దక్షిణాఫ్రికా రాజధాని జొహాన్నెస్‌బెర్గ్‌లో జరిగిన ఈ వేడుకలలో జడ్జిగా పాల్గొనేందుకు మాజీ మిస్‌వరల్డ్, బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా కూడా వెళ్లింది. కంగ్రాట్స్ కియానే ఆల్టోరినో..
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి