వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

22 జిల్లాలకు తల్లి హైదరాబాద్: లగడపాటి

By Santaram
|
Google Oneindia TeluguNews

Lagadapati
న్యూఢిల్లీ: తెలంగాణ అంటే 23 జిల్లాల సముదాయమని, హైదరాబాదు మిగిలిన జిల్లాలకు తల్లి వంటిదని విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. న్యూఢిల్లీలోని తన నివాసంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. కొడుకులు ఎందరు ఉన్నా తల్లి ఒక్కతేనని, అలాగే రాష్ట్రం మొత్తానికి తల్లి హైదరాబాదని, 22 జిల్లాలు దాని బిడ్డలని ఆయన అభిప్రాయపడ్డారు. మనది తెలుగుజాతి అని, తెలంగాణ అంటే తెలుగు మాట్లాడే ప్రాంతం అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ఘనచరిత్ర ఉందన్నారు. విశాలాంధ్ర ప్రజలు విశాల భావాలు గలవారని, ఏప్రాంతంవారైనా ఎక్కడ నుంచైనా గెలుస్తారని గర్వంగా చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు దేశాన్ని కలచివేశాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయుడిగా తాను ఎంతో బాధపడుతున్నానన్నారు. "భారత్‌ని విడగొట్టొద్దు, కలసి ఉందాం'' అన్న మహాత్ముని మాటలు ఒకసారి గుర్తు చేసుకుందామన్నారు. కలిసి ఉండాలనే ఆలోచన ప్రతిజిల్లా వారికి ఉందని, కొన్ని శక్తుల వల్ల ఆందోళనలు మొదలయ్యాయన్నారు. కొందరు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు.

జలదోపిడీ అనేది వాస్తవం కాదన్నారు. పోలవరం, ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టులకు జాతీయ హోదా కోసం ఎంపిలందరం కలసికట్టుగా పోరాడి సాధించుకుందామని చెప్పారు. తెలంగాణ కోసం ప్రక్రియ మొదలవుతుందని యుపిఏ ప్రభుత్వం ప్రకటించిందని, కాంగ్రెస్‌ పార్టీ కాదని ఆయన వివరించారు. శాసనసభలో తెలంగాణపై తీర్మానం ప్రవేశపెడితే 294 మంది శాసనసభ్యులలో 225 మంది వ్యతిరేకిస్తారని చెప్పారు. రాజీనామా చేసిన శాసనసభ్యులందరూ ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. శాసనసభ్యులందరూ సమైక్యాంధ్రకు మద్దతు పలకాలని విజ్ఞప్తి చే శారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఉద్యమంలో తానూ భాగస్వామినవుతానని చెప్పారు. తన రాజీనామా వ్యక్తిగతమని, తన వైఖరి రేపు మీడియాకు చెపుతానని అన్నారు. ముఖ్యమంత్రి రోశయ్యపై తనకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X