సీమాంధ్ర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఆందోళన

కొన్ని ప్రాంతాల్లో ఆందోళనకారులు బంద్ నిర్వహిస్తున్నారు. విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. తిరుపతిలో ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చారు. రాజమండ్రిలో విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో జైరాముడు అనే తాపీ మేస్త్రీ సమైక్య నినాదానికి అనుకూలంగా గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయవాడలో తెలుగుదేశం శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వర రావు ఇప్పటికే ఆమరణ నిరాహార దీక్ష సాగిస్తున్నారు. తెలుగుదేశం శాసనసభ్యులు పరిటాల సునీత, పల్లె రఘునాథ రెడ్డి అనంతపురంలో ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా బంద్ జరుగుతోంది.












Click it and Unblock the Notifications