తెలంగాణపై అసెంబ్లీ తీర్మానం కావాలి: ప్రణబ్ ముఖర్జీ

Pranab Mukherjee
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లు ప్రతిపాదించడానికి శాసనసభలో తీర్మానం కావాల్సిందేనని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ రాయలసీమ, కోస్తాంధ్ర కాంగ్రెసు పార్లమెంటు సభ్యులకు హామీ ఇచ్చారు. అసెంబ్లీ తీర్మానం లేకుండా పార్లమెంటులో తెలంగాణపై చర్చ కూడా జరగదని ప్రణబ్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. సాయంత్రం 6 గంటలకు అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం చెప్తామని ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులకు హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు శాసనసభ ఆమోదం ఆవసరం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చేసిన ప్రకటనతో ప్రణబ్ వ్యతిరేకించినట్లు కావూరి సాంబశివరావు చెప్పారు. ప్రణబ్ తో భేటీ అనంతరం కావూరి సాంబశివ రావు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

చిదంబరం ప్రకటన రాగానే తమ తమ ప్రాంతాల్లో దాన్ని అర్థం చేసుకుని, అపార్థం చేసుకుని ప్రజలు అందోళనలకు దిగారని తాము చెప్పినట్లు ఆయన తెలిపారు. బాధతో, దుగ్ధతో ప్రజలు వీధికెక్కారని ఆయన అన్నారు. ప్రణబ్ ముఖర్జీ తమకు హామీ ఇచ్చినందున ఆందోళనలు విరమించాలని ఆయన పిలుపునిచ్చారు. శాసనసభ తీర్మానం రాకపోతే తెలంగాణ రాదని ప్రణబ్ చెప్పినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రం చీలిపోతుందనే నమ్మకం తమకు లేదని పార్లమెంటు సభ్యుడు సాయిప్రతాప్ అన్నారు. రాష్ట్ర ప్రజల అభిప్రాయం పార్లమెంటుకు రావాలని కనుమూరి బాపిరాజు అన్నారు. దేశరక్షణ దృష్యా చిన్న రాష్ట్రాల ఏర్పాటు సరి కాదని మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. సమైక్యమంటే తెలంగాణ గురించి ఆలోచిస్తామని ఆయన చెప్పారు. రాజీనామాలు చేయడం పార్టీ ధిక్కారమేమీ కాదని మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+