సమైక్యవాదులది ఏకపక్ష ప్రేమ: ఈటెల

Etala Rajendar
హైదరాబాద్: తాము సిద్ధంగా లేమని తెలంగాణ ప్రజలు చెబుతుంటే కలిసి ఉండాలని సమైక్యవాదులు ఏకపక్ష ప్రేమను ప్రదర్శిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. తమకు రాష్ట్ర కావాలా, వద్దా అనేది తెలంగాణ ప్రజలు నిర్ణయించుకుంటారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కోస్తాంధ్ర, రాయలసీమల్లో జరుగుతున్నది ధర్మపోరాటం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయం ముందుకు వచ్చినప్పుడే జై ఆంధ్ర, గ్రేటర్ రాయలసీమ, సమైక్య నినాదాలతో ఉద్యమాలు ముందుకు వస్తున్నాయని, దాన్ని బట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును అడ్డుకోవడం తప్ప న్యాయబద్ధంగా పోరాటాలు చేయడం లేదనేది అర్థమవుతుందని ఆయన అన్నారు.

తెలంగాణ తీర్మానం పెడితే శాసనసభలో సమర్థిస్తామని చెప్పిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటన వెలువడగానే తమ నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నారని ఆయన అన్నారు. తెలంగాణను మరోసారి వంచించడానికి పార్టీలకు అతీతంగా జెండాలను, సిద్ధాంతాలను పక్కనపెట్టి 24 గంటలలోపే ఏకమయ్యారని ఆయన అన్నారు. తెలంగాణకు ద్రోహం చేయడానికి అన్నీ వదులుకున్నారని ఆయన అన్నారు. తమది ఆకలి, నిరుద్యోగం, ఆత్మహత్యలు, నీళ్ల సమస్య అని ఆయన అన్నారు. తమపై కుట్రపూరితంగా కోస్తా, రాయలసీమ శాసనసభ్యులు ఏకమయ్యారని ఆయన వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+