హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటుకు వెంటనే శాసనసభలో తీర్మానం ప్రతిపాదించకపోతే తాను శాసనసభ ఎదుట నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని విజయవాడ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ హెచ్చరించారు. ప్రత్యేక తెలంగాణపై శాసనసభలో వెంటనే తీర్మానాన్ని ప్రతిపాదించాలని, ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని శాసనసభ్యులు ఆత్మప్రబోధం ప్రకారం ఓటేసేందుకు అవకాశం కల్పించాలని ఆయన శుక్రవారం డిమాండ్ చేశారు. లేకుంటే తాను కూడా సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాల్సి వస్తుందని ఆయన హెచ్చరిచారు.
ఆ మేరకు రాజగోపాల్ ముఖ్యమంత్రి కె. రోశయ్యకు ఒక లేఖ రాశారు. అనంతరం ఆ లేఖను ఆయన పత్రికలకు విడుదల చేశారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దేశమంతా చాటడానికి, రాష్ట్ర ప్రజలందరూ ఏకంగా ఉన్నారనే సమైక్యనినాదం శాసనసభలో మారు మోగడానికి తీర్మానం వెంటనే ప్రతిపాదించడం అవసరమని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి