సిఎంగా రోశయ్య రాజీనామా చేయరు: మొయిలీ

Veerappa Moily
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కె.రోశయ్య రాజీనామా చేయబోరని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన యోచనలో అర్థం లేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రాష్ట్రపతి పాలన విధించే అవకాశం లేదని ఆయన చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కె. రోశయ్య రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. అన్ని ప్రాంతాలవారితో చర్చంచిన తర్వాతే ప్రత్యేక తెలంగాణపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.

కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రజల్లో వెల్లువెత్తిన నిరసనతో కాంగ్రెసు పార్టీ అధిష్టానంలో కదలిక వచ్చింది. దీంతో రాష్ట్రానికి కాంగ్రెసు అధిష్టానం దూతను పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి దూత వస్తాడని కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి హైదరాబాదులో చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+