లగడపాటి దీక్షపై విజయవాడలో తీవ్ర ఉత్కంఠ

Lagadapati Rajagopal
విజయవాడ: కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ హైదరాబాద్ లో తలపెట్టిన నిరాహార దీక్షపై విజయవాడ నగరంలో సోమవారం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరికొద్ది గంటల్లో రాజగోపాల్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి దీక్ష ప్రారంభించవలసిఉంది. అయితే ఆయనకు నిరాహార దీక్షకు అనుమతి లేదని ఐజి అనురాధ ప్రకటించారు. రాజగోపాల్ హైదరాబాద్ షంషాబాద్ విమానాశ్రయంలో దిగిన వెంటనే అరెస్టు చేయడానికి రంగం సిద్ధమైంది.

రాజగోపాల్ 2004 నుంచి సమైక్యాంధ్ర వాదం విన్పిస్తున్నారు. తెలంగాణ వాదులంతా రాజగోపాల్‌పైకి ఒంటికాలితో లేచేవారు. ఆయన కూడా అంతే స్థాయిలో ఏమాత్రం తగ్గకుండా సై అంటే సై అనేవారు. ఈ అయిదేళ్ళలో అనేకమార్లు టీఆర్‌ఎస్‌ శ్రేణులు, రాజగోపాల్‌ మధ్య హైదరాబాద్‌ లో యుద్ధమే జరిగింది.

హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో గొడవ జరిగింది. నిజమాబాద్‌లో శ్రీనివాస్‌ కుమారుడు పెళ్ళికి వెళ్ళిన రాజగోపాల్‌ కు అక్కడ కూడా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో ఘర్షణ జరిగింది. టీఆర్‌ఎస్‌ తో ఈ అయిదేళ్ళు రాజగోపాల్‌ ఒంటరి పోరాటం జరిపారు. హైదరాబాద్ లో రాజగోపాల్ ను అరెస్టు చేస్తారా? అరెస్టు చేస్తే ఎక్కడికి తరలిస్తారు అని స్ధానిక నాయకులు చర్చించుకుంటున్నారు. విజయవాడలో సమైక్యాంధ్ర కోసం ఆందోళన చేస్తున్నవారు సోమవారం ఉదయం టీవీలకు అతుక్కుపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+