వైయస్ జగన్ టిడిపితో కలిశారు: సర్వే

తెలుగుదేశం పార్టీతో కలిసి తమ పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని జగన్ ప్రయత్నించారని సర్వే అన్నారు. జగన్ వ్యవహార శైలి వల్ల తాము బాధ పడ్డామని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. తమకు దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిపై ఆప్యాయత, ప్రేమ ఉన్నాయని, జగన్ ఆ రకంగా వ్యవహరించడం తమకు బాధ కలిగించిందని ఆయన అన్నారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని తాము కోరుకున్నామని, కానీ తాము ప్రత్యేక తెలంగాణను కోరుకుంటున్నామని భువనగిరి పార్లమెంటు సభ్యుడు రాజగోపాల్ రెడ్డి అన్నారు. జగన్ కావాలని అలా చేసి ఉండరని ఆయన సమర్థించే ప్రయత్నం చేశారు.












Click it and Unblock the Notifications