కొనసాగుతున్న సమైక్యాంధ్ర ఆందోళన

రాజమండ్రి జాతీయ రహదారిని ఆందోళనకారులు దిగ్బంధం చేశారు. చీరాలలో కాంగ్రెసు నాయకులు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. కర్నూలులో గత ఐదు రోజులుగా బస్సులు కదలడం లేదు. రిలే నిరాహార దీక్షలు ఐదో రోజుకు చేరుకున్నాయి. గుంటూరు జిల్లాలోని చిలుకూరిపేట, సత్తెనపల్లి ప్రాంతాల్లో రిలే నిరాహార దీక్షలు సాగిస్తున్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో రిలే నిరాహార దీక్షలు సాగుతున్నాయి. కొన్ని చోట్ల రైళ్లను కూడా ఆపేశారు. శబరి ఎక్స్ ప్రెస్ ను ఆందోళనకారులు ఆపేశారు. కాకినాడలో కాంగ్రెసు శానసభ్యుడు చంద్రశేఖర రెడ్డి దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది.












Click it and Unblock the Notifications