విశాఖ జిల్లాలో సమైక్య ఆంధ్ర ఉద్యమం ఉధృతం

కాంగ్రెస్ పార్టీ ముందుగా నిర్ణయించిన ప్రకారం జిల్లాలోని పలు మండల కేంద్రాల్లో సోమవారం నుంచి రిలేనిరాహార దీక్షా శిబిరాలకు శ్రీకారం చుట్టింది. అదేసమయంలో టీడీపీ మండల కేంద్రాల్లో రాస్తారోకో, నిరసనలకు దిగింది.
రోజురోజుకు ఉధృతమవుతున్న ఈ ఉద్యమానికి వివిధ వర్గాల నుంచి మద్దతు పెరుగుతున్నది. సోమవారం పలుప్రాంతాలకు చెందిన లాయర్లు, విద్యార్థులు అవిభాజ్య ఆంధ్రాకు అనుకూలంగా రోడ్డెక్కి, నిరశనలకు దిగడం జరిగింది.
సోమవారం మన్యంలో తలపెట్టిన అఖిల పక్షం బంద్ ప్రశాంతంగా జరిగింది. రానున్నరోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు కాంగ్రెస్, టీడీపీ, పీఆర్పీలు ప్రత్యేక వ్యూహాలతో సన్నద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో చోటుచేసుకుంటన్న వరస పరిణామాలతో సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రరూపం దాలుస్తున్నది.












Click it and Unblock the Notifications