రామోజీరావు స్వగ్రామంలో సమైక్య ఉద్యమం తీవ్రం

కార్యక్రమంలో జడ్పీటీసీ పొట్లూరి హనుమంతరావు, ఎంపీపీ విఆర్ ప్రసాద్, డీసీసీ ఉపాధ్యక్షుడు కొడాలి జగన్మోహనరావు, రాజబోయిన కోటయ్య, ఎంపీటీసీల సంఘం కార్యదర్శి నామా వెంకటేశ్వరరావు, దేశం నాయకులు సూరపనేని సురేంద్రబాబు, సర్పంచ్ మత్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
అఖిలపక్షం ఆధ్వర్యంలో పెదపారు పూడి ఆర్ అండ్ బి రహదారిపై రెండు గంటల పాటు రాస్తారోకో చేశారు. ఎంపీ రాజగోపాల్ అరెస్టుకు నిరస నగా రాస్తారోకో చేసి కేసీఆర్ దిష్టిబొ మ్మను దహనం చేశారు. జడ్పీటీసీ పొట్లూరి హనుమంతరావు, ఎంపీపీ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
యలమర్రు నాలుగు రోడ్ల కూడలిలో 500 మంది విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. తొలుత సోనియాగాంధీ, చిదంబరం, కేసీఆర్ దిష్టిబొమ్మలను గ్రామంలో ఊరేగించి దహనం చేశారు. కార్యక్రమంలో బొప్పన రమేష్‌చౌదరి, కుమార్‌స్వామి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications
