మా వాళ్లే టిడిపితో చేతులు కలిపారు: జగన్ పై విహెచ్

యాభై ఏళ్ల ఆకాంక్ష తీరే సమయం వచ్చేసరికి కొంత మంది విద్యార్థులను పట్టుకుని హంగామా చేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెసులో వాదనలు, చర్యలు జరుగుతున్న కాలంలో మాట్లాడని నాయకులు ఇప్పుడు నిరాహార దీక్షలు చేస్తున్నారని ఆయన విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ను ఉద్దేశించి అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని సిఎల్పీ తమకు తెలంగాణ కావాలంటూ సోనియాకు వినతి పత్రం ఇచ్చారని, పలు సందర్భాల్లో తెలంగాణకు కాంగ్రెసు అధిష్టానం అనుకూలంగా చర్యలు తీసుకుందని, తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకుందని, ప్రాంతీయ బోర్డులను ఏర్పాటు చేసాశారని, ఈ సందర్భాల్లో ఎప్పుడు కూడా ఈ సమైక్యవాదులు ఎందుకు మాట్లాడలేదని ఆయన అన్నారు. ఇప్పుడు ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పేసరికి హంగామా చేస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications