వైయస్సార్ కాంగ్రెసుకు జగన్ ఏర్పాట్లు

పార్లమెంటులో సమైక్యనినాదం వినిపించడం ద్వారా అధిష్టానంపై జగన్ ధిక్కార స్వరం వినిపించారు. ఇది కూడా వ్యూహాత్మకంగానే జరిగిందనే అభిప్రాయం ఉంది. నిజానికి, శాసనసభలో తెలంగాణ తీర్మానం పెడితే దాన్ని ఓడించి, మెజారిటీ శాసనసభ్యుల అండతో ఆ తర్వాత ముఖ్యమంత్రి కావాలని జగన్ ఎత్తులు వేసినట్లు చెబుతున్నారు. తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీల కోస్తాంధ్ర, రాయలసీమ శఆసనభ్యులతో కలిసి ఆ మేరకు ఒక ప్రణాళిక సిద్ధమైనట్లు కూడా ప్రచారం సాగుతోంది. సమైక్యాంధ్ర నినాదం వెనక ఉన్నది జగన్ వర్గమేనని నిర్ధారించుకున్న కేంద్రం తెలంగాణ విషయంలో వెనక్కి తగ్గడానికి ఏ మాత్రం సుముఖంగా లేరని చెబుతున్నారు.
జగన్ ను ముఖ్యమంత్రిని చేస్తే ప్రాంతీయ ఉద్యమాలను సమర్థంగా అణచివేయగలరనే వాదన కూడా కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా వద్దకు వెళ్లినట్లు సమాచారం. ఈ స్థితిలో జగన్ ఏర్పాటు చేయదలుచుకున్న పార్టీపై ఆరాలు మొదలయ్యాయి. కడప జిల్లాకు చెందిన వైయస్సార్ అభిమాని ఆ పార్టీ పేరును నమోదు చేయించినట్లు తెలుస్తోంది. జగనే అతనితో పార్టీ పేరును నమోదు చేయించినట్లు భావిస్తున్నారు. ఈ విషయమై సోనియా జగన్ ను పిలిచి అడిగినట్లు సమాచారం. దానితో తనకు సంబంధం లేదని, వైయస్సార్ ఆభిమాని ఆ పని చేశారని జగన్ చెప్పిన సమాధానాన్ని సోనియా నమ్మడం లేదని చెబుతున్నారు. జగన్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడడం కన్నా ముందే సంక్షోభాన్ని సృష్టించి దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలో భాగంగానే తెలంగాణ ఏర్పాటు నిర్ణయాన్ని ప్రకటించినట్లు, దాని నుంచి వెనక్కి తగ్దేందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications
