లగడపాటి రాజగోపాల్ దీక్షలోనే ఉన్నారు: జెసి

JC Diwakar Reddy
హైదరాబాద్: కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ దీక్షలోనే ఉన్నారని కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి చెప్పారు. లగడపాటి హైదరాబాదులోని నిమ్స్ కున్న వెంటనే ఆయన నిమ్స్ కు వచ్చారు. ఆయన నిమ్స్ ను పరామర్శించిన తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తాను లగడపాటి వస్తారని తెలిసి ఇక్కడికి రాలేదని ఆయన చెప్పారు. లగడపాటి రాజగోపాల్ ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. తాను విషయాన్ని ముఖ్యమంత్రి కె. రోశయ్యకు చెబుతానని ఆయన చెప్పారు.

లగడపాటి రాజగోపాల్ విషయం ఇప్పటికే ముఖ్యమంత్రికి తెలిసి ఉంటుందని ఆయన చెప్పారు. లగడపాటి ఆరోగ్యం సంతృప్తికరంగానే ఉందని ఆయన చెప్పారు. లగడపాటి రాజగోపాల్ అలసిపోయి పడుకున్నారని, తాను లగడపాటితో మాట్లాడలేకపోయానని ఆయన చెప్పారు. తాను వైద్యులతో మాట్లాడినట్లు, లగడపాటిని కదిలించవద్దని వారు చెప్పినట్లు ఆయన అన్నారు. కాగా, రాజగోపాల్ నిమ్స్ లో చేరడంతో తెలంగాణ అనుకూలవర్గాలు ధర్నాకు దిగాయి. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+