విజయవాడ ఆస్పత్రి నుంచి లగడపాటి మాయం

లగడపాటి వాహనం దాదాపు వంద కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లినట్లు చెబుతున్నారు. ఆయన విశాఖపట్నం వైపు వెళ్లారని, ఖమ్మం మీదుగా హైదరాబాద్ సాగుతున్నారని, అనంతపురం వైపు వెళ్లారని - ఇలా పలు రకాలుగా రాత్రి ప్రచారం సాగింది. ఆయన మాయం కావడానికి కొద్ది సేపటికి ముందే రాష్ట్ర గవర్నర్ ఎన్డీ తివారీకి ఫ్యాక్స్ పంపారు. తనకు విజయవాడలో సరైన వసతులు లేవని, తనను మానసికంగా వేధిస్తున్నారని, తన ప్రాణాలకు ఐజి, కమిషనర్ నుంచి హాని ఉందని ఆయన గవర్నర్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆయన విజయవాడలోనే ఉండవచ్చునని కూడా భావిస్తున్నారు. లగడపాటి కోసం పోలీసులు అంతటా గాలిస్తున్నారు.
లగడపాటి పారిపోయిన వెంటనే విజయవాడ నుంచి అన్ని వైపులకు వెళ్లే రహదారులను దిగ్బంధం చేశారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేశారు. గన్నవరం వద్ద చెక్ పోస్టుకు లగడపాటి వాహనం ఢీకొన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే అది లగడపాటి వాహనం కాదని ఐజి ఉమేష్ షరాఫ్ చెప్పారు. లగడపాటి మాయమయ్యారనే వార్త విన్న వెంటనే డిజిటి గిరీష్ కుమార్ కోస్తాంధ్ర, రాయలసీమ ఎస్పీలతో, విజయవాడ పోలీసు కమిషనర్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విజయవాడ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
లగడపాటి మాయమైనట్లు వార్తలు వచ్చిన వెంటనే ఆయన అనుచరులు, కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్దకు చేరుకుని ధర్నా చేశారు. ఆయన భార్య పద్మజ ఆస్పత్రికి చేరుకుని పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భర్తకు ఏమైనా జరిగితే పోలీసులది, హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిది బాధ్యత అని ఆమె ఆరోపించారు. తన భర్త ఎక్కడుకున్నారో పోలీసులే చెప్పారు.












Click it and Unblock the Notifications