సమైక్యాంధ్ర కోసం రాజోలులో అర్చకుల పాదయాత్ర

Dhavaleswaram Barrage
రాజమండ్రి: సమైక్యాంధ్రాయనమః అంటూ రాజోలు నియోజకవర్గ పరిధిలోని అర్చకులు ఆదివారం గళమెత్తారు. స్థానిక వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి శాంతి పఠనం చేస్తూ గ్రామంలో పాదయాత్ర చేశారు. గాంధీబొమ్మ సెంటరు శిబిరంలో ఉన్న ఎమ్మెల్యే వరప్రసాదరావు, ఆమరణ దీక్ష చేపట్టిన నాయకులు, రిలేదీక్షలు చేస్తున్న టైలర్స్‌ సంఘ సభ్యులకు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. రాజోలు దీక్షల్లో రాష్ట్ర టైలర్స్‌ నాయకుడు పి.రాము ఆధ్వర్యంలో టైలర్స్‌ దీక్షలు చేపట్టారు. తాటిపాక శిబిరంలో వాణిజ్య కార్మిక సంఘ సభ్యులు దీక్షలు చేసి రాస్తారోకో నిర్వహించారు.

సమైక్యాంధ్రకు మద్దతుగా నాలుగురోడ్ల కూడలిలో దున్నపోతుపై కేసీఆర్‌ పేరు రాసి దిష్టిబొమ్మను ఊరేగించి దహనం చేశారు. ఎనిమిదో రోజు దీక్షల్లో జక్కంపూడి వాసు, పినిశెట్టి శేఖర్‌ పాల్గొన్నారు. పాశర్లపూడిలంకలో రిలే దీక్షలు చేపట్టారు. ఎంపీటీసీ కోలా సత్యనారాయణ, సర్పంచ్‌ బొంతు అమరావతి, తెలగారెడ్డి రాధాకృష్ణ, పెదమల్లు రామకృష్ణ పాల్గొన్నారు. పాశర్లపూడి దీక్షల్లో 13ఏళ్ల అంధుడు బొరుసు హరికృష్ణమణికంఠతో పాటు 27 మంది పాల్గొన్నారు. పలు గ్రామాల్లో కేసీఆర్‌ దిష్టిబొమ్మలను దహనం చేశారు. గెడ్డం రామారావు, మద్దాల కృష్ణమూర్తి, జక్కంపూడి తాతాజీ, భూపతిరాజు ఈశ్వరరాజువర్మ, దాకే సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+