లగడపాటి దొంగలా ఉరుకొచ్చారు: పొన్నం

Lagadapati Rajagopal
హైదరాబాద్: తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ విజయవాడ అస్పత్రి నుంచి హైదరాబాద్ నిమ్స్ కు పరుగెత్తుకొచ్చిన తీరును కాంగ్రెసు తెలంగాణ నాయకులు తీవ్రంగా తప్పు పట్టారు. లగడపాటి రాజగోపాల్ ప్రజాప్రతినిధిలాగా వ్యవహరించలేదని, దొంగలాగా పరుగెత్తుకొచ్చారని కాంగ్రెసు ఎంపీల ఫోరం కన్వీనర్ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. లగడపాటి రాజగోపాల్ ప్రజాప్రతినిధిలాగా వ్యవహరించలేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఇంత నీచంగా వ్యవహరిస్తున్న లగడపాటి చికిత్సకు ప్రాధాన్యం ఇస్తున్నారా, ఉద్యమానికి ప్రాధాన్యం ఇస్తున్నారా తేలిపోయిందని ఆయన అన్నారు.

తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే ఉద్దేశంతో లగడపాటి నిమ్స్ కు వచ్చారని ఆయన ఆరోపించారు. నిమ్స్ కు రావడాన్ని గొప్పదనంగా లగడపాటి చెప్పుకుంటే అది పొరపాటే అవుతుందని ఆయన అన్నారు. లగడపాటి ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స తీసుకుంటే మంచిదని, అక్కడ జాతీయ మీడియా కూడా ఉంటుందని, అక్కడ ఇక్కడి కన్నా ఎక్కువ మీడియా ప్రచారం లభిస్తుందని ఆయన అన్నారు. లగడపాటి రాజగోపాల్ వ్యవహరించిన తీరును కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంతరావు తప్పు పట్టారు. రెచ్చగొట్టేందుకే రాజగోపాల్ నిమ్స్ కు వచ్చారని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. రాజగోపాల్ ను ఇక్కడి నుంచి మార్చాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

సమైక్యాంధ్ర కోసం ప్రాణత్యాగం చేయాలని అనుకునేవారు వైద్యం కోసం పరుగెత్తరని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లగడపాటి రాజగోపాల్ ను ఉద్దేశించి అన్నారు. డ్రామాలొద్దని ఆయన లగడపాటికి సూచించారు. ఇప్పటికే లగడపాటి రాజగోపాల్ అధిష్టానాన్ని ధిక్కరించారని, అధిష్టానం లగడపాటిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆయన చెప్పారు. లగడపాటి రాకతో నిమ్స్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యకర్తలు నిమ్స్ కు చేరుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+