బెజవాడ పోలీసు కమిషనర్ పై సస్పెన్షన్

పూర్తి సంఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించామని, ఆ విచారణ నివేదిక ఆధారంగా రాజగోపాల్ సహా మిగతావారిపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. రాజగోపాల్ పై కేసు నమోదైనట్లు తెలిపారు. నిమ్స్ కు తరలించాలని రాజగోపాల్ కోరుతున్న మాట వాస్తవమేనని ఆయన అన్నారు. వైయస్ వివేకానంద రెడ్డి, దేవినేని ఉమా మహేశ్వర రావు తదితరులు కూడా నిమ్స్ కు తరలించాలని కోరుతున్నట్లు ఆయన చెప్పారు. ఎవరినీ ప్రభుత్వం సహించబోమని ఆయన చెప్పారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వ్యవహరిస్తామని అనుకుంటే సరి కాదని ఆయన అన్నారు. తెలంగాణలో పరిస్థితి మెరుగుపడిందని, ఈ స్థితిలో సీమాంధ్రలోని ఉద్యమాన్ని తిరిగి వారిని హైదరాబాదుకు తరలించడం ద్వారా పెంచదలుచుకోలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications