వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాజీనామాలతో తెలంగాణ ఎంపీల ఒత్తిడి

తెలంగాణ పార్లమెంటు సభ్యులు గురువారం ఆంధ్రభవన్ లో సమావేశమై భవిష్యత్తును నిర్ణయించుకోనున్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీలను వారు కలుసుకుంటారు. అవసరమైతే ఢిల్లీలో నిరాహార దీక్షలకు దిగేందుకు కూడా సిద్ధమవుతున్నారు. బుధవారం చిదంబరం ప్రకటన వెలువరించిన తర్వాత తెలంగాణ పార్లమెంటు సభ్యుల నుంచి ఒక రకంగా మిశ్రమ స్పందన వ్యక్తమైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై సర్వే సత్యనారాయణ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటివారు నమ్మకం వ్యక్తం చేశారు. చిదంబరం ప్రకటన తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పేందుకు ప్రయత్నించారు. అయితే, ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో, తెలంగాణలోని తాజా పరిణామాల నేపథ్యంలో పార్లమెంటు సభ్యులు రాజీనామాలకు సిద్ధపడుతున్నారు.