హైదరాబాద్: హైదరాబాద్‌ని ఆర్థికంగా దెబ్బతీసేందుకు సీమాంధ్ర నేతలు కుట్రపన్నుతున్నారని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌ని కేంద్రపాలిత ప్రాంతం చేయాలన్న మాజీ మంత్రి జెసి వాక్యలు అర్ధరహితమని ఆయన అన్నారు. ఇక్కడి భూములను అమ్మి, సీమాంధ్రలో పెట్టుబడులు పెట్టారని విమర్శించారు.
సినిమా పరిశ్రమకు, స్టూడియోలకు ఇచ్చిన భూములన్నీ సీమాంధ్రవారే దక్కించుకున్నారని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేవిధంగా మాట్లాడితే సహించం అని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ జెఎసిలో చేరితే తప్పులేదన్నారు. తెలంగాణ ఏర్పడితే ఆ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకి, పోరాడిన ప్రజలకు దక్కుతుందన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి