చిరంజీవి తెలంగాణ ద్రోహి: ప్రజా తెలంగాణ సమితి

రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.డి.రియాజ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో చిరంజీవిని తిరుగనివ్వకుండా అడ్డుకుంటామని చెప్పారు. తెలంగాణ బిడ్డలుగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళతామన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్.రాజారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలోని 10 జిల్లాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తల సమష్టి నిర్ణయం మేరకే పీటీఎస్ ఆవిర్భవించిందని చెప్పారు. మిగత పార్టీల్లా భౌగోళిక తెలగాణకే పరిమితం కాకుండా సామాజిక తెలంగాణ లక్ష్యంగా ఉద్యమిస్తామని పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడు బానోతు శంకర్‌నాయక్ మాట్లాడుతూ సామాజిక న్యాయం, సామాజిక తెలంగాణ అంశాలకు ఆకర్షితులై ఎందరో పీఆర్పీలో చేరితే సమైక్యనినాదం ఎత్తుకుని చిరంజీవి ద్రోహం చేశారని విమర్శించారు.












Click it and Unblock the Notifications