రాజీనామాలపై స్పీకర్ పై ఒత్తిడి: నాగం

జెఎసిలోకి తమను కాంగ్రెసు పార్టీ కూడా ఆహ్వానించిందని ఆయన చెప్పారు. తెలంగాణపై తమ కార్యక్రమాలన్నీ శాంతియుతంగానే జరుగుతాయని ఆయన చెప్పారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై ప్రభుత్వ అణచివేత చర్యలను ఆయన ఖండించారు. కేంద్రం సానుకూలంగా ప్రతిస్పందించిందని రాష్ట్రానికి చెందిన తెలంగాణ మంత్రులు చేసిన ప్రకటనపై మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా ఆ విషయం వారినే అడగాలని, కేంద్రం నుంచి తమకు స్పష్టమైన లేఖను తెస్తే తమకు అభ్యంతరమేమీ లేదని ఆయన అన్నారు. ఎల్లుండి తెలంగాణ బంద్ ను కూడా ప్రశాంతంగా పాటించాలని ఆయన ప్రజలను కోరారు. విద్యార్థులపై, ఆందోళనకారులపై కేసులు పెట్టి హింసించినంత మాత్రాన ఉద్యమం ఆగిపోదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications