వైజాగ్ ప్రొఫెసర్ హత్య కేసు మిస్టరీ వీడింది

నిందితుడ్ని విజయనగరంలో అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. నిందితుడు పిఠాపురం కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఓ ప్రైవేటు కంపెనీలో మెడికల్ రిప్రంజెంటేటివ్‌గా పని చేస్తున్నాడు. అతనికి భార్య శరీష, ఐదేళ్ల కుమారుడున్నాడు. నిందితుడ్ని ఆదివారం రిమాండ్‌కు పంపించినట్టు పీఎంపాలెం సీఐ పాపారావు తెలిపారు.
తన భార్య శిరీషతో కిషోర్ సాన్నిహిత్యంగా ఉండడం ఇష్టం లేకపోవడం వల్లే హత్య చేసినట్టు సాయికుమార్ అంగీకరించాడు. నిందితుని కథనం ప్రకారం.. సాయికిషోర్, శిరీష కలిసిమెలిసి తిరుగుతుంటే సాయికుమార్ సహించలేకపోయేవాడు. అయినా ఒకే కళాశాలలో పని చేస్తున్నారని సరిపెట్టుకునేవాడు. కానీ గత శనివారం(ఈ నెల 19న) సాయికుమార్‌కు పిడుగులాంటి వార్త తెలిసింది. శిరీషతో కిషోర్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని తెలిసి ఆదివారం వాళ్లింటికెళ్లి సాయికిషోర్‌ను హెచ్చరించాడు. అయినా అదే రోజు సాయంత్రం నుంచి కిషోర్ మళ్లీ శిరీషకు ఫోన్ చేయడం మొదలెట్టాడు. దీంతో అతడ్ని చంపేయాలని సాయికుమార్ పన్నాగం పన్నాడు. పథకం ప్రకారం..
శిరీష గురించి మాట్లాడాలని కి షోర్‌ను తెన్నేటిపార్కుకు మంగళవారం రాత్రి పిలిచాడు. అక్కడ వారిద్దరి మధ్య వాగ్వాదమైంది. శిరీషను వదిలేది లేదని కిషోర్ తెగేసి చెప్పాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. ఈ నేపథ్యంలో సాయికిషోర్ బాత్రూమ్ కోసం వెళ్లిన సమయంలో కుమార్ కూల్ డ్రింక్ తెప్పించి అందులో నిద్రమాత్రలు కలిపాడు. ఆ డ్రింకును కిషోర్‌తో తాగించాడు. తాగిన కొద్దిసేపటికే మత్తులో జారిపోయిన కిషోర్‌పై ఆ పక్కనే ఉన్న సిమెంట్ పలకతో బలంగా మోది చంపేశాడు. అనంతరం తలను ఇసుకలో కూరేసి కుమార్ అక్కడి నుంచి ఉడాయించాడు.












Click it and Unblock the Notifications