మొయిలీతో తెలంగాణ మంత్రుల భేటీ

రాష్ట్ర విభజనపై కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చేసిన ప్రకటన అనంతరం సంభవించిన పరిణామాలపై తెలంగాణ మంత్రులు మొయిలీకి వివరించారు. తమకు సంతృప్తికరమైన ప్రకటన వచ్చే వరకు తమ రాజీనామాలను ఉపసంహరించుకోబోమని మంత్రి జూపల్లి కృష్ణారావు అంతకు ముందు మీడియా ప్రతినిధులతో చెప్పారు. తమకు ప్రణబ్ ముఖర్జీ ఇచ్చిన హామీతో సంతృప్తి చెందామని, రాజీనామాల ఉపసంహరణపై ఆలోచన చేస్తున్నామని వచ్చిన వార్తల్లో నిజం లేదని భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. తన మాటలను మీడియా వక్రీకరించిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications