వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రామోజీ ఫిల్మ్ సిటీలో కార్యక్రమాలు రద్దు

రామోజీ ఫిల్మ్‌సిటీలో న్యూ ఇయర్ వేడుకల నిర్వహణ ఏర్పాట్లను వెంటనే నిలిపివేయాలని పలు ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మహాత్మా జ్యోతిరావూ పూలే యువజన సంఘం, మాదిగ మహాజన తెలంగాణ పార్టీల ఆధ్వర్యంలో ఫిల్మ్‌సిటీ గేటువద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా పూలే యువజనసంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్‌గౌడ్, మాదిగ మహాజన తెలంగాణ పార్టీ అధ్యక్షుడు వెలిజాల బస్వయ్య మాదిగ మాట్లాడుతూ ఉద్యమాలతో తెలంగాణ అట్టుడికిపోతుంటే రామోజీ ఫిల్మ్‌సిటీలో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.