హస్తినలో నేతల పోటాపోటీ మంతనాలు

కాగా, సీమాంధ్ర తెలుగుదేశం నాయకులు రాజ్యసభ సభ్యుడు ఎంవి మైసురారెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. అఖిల పక్ష సమావేశంలో రాయలసీమకు ప్రాతినిధ్యం లేకపోవడం పట్ల మైసురా రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు తెలుగుదేశం తెలంగాణ నాయకులు కేంద్ర హోం మంత్రి పి. చిదంబరాన్ని కలుసుకోబోతున్నారు. కాంగ్రెసు సీమాంధ్ర నాయకులు కూడా చిదంబరాన్ని కలుసుకున్నారు. అలాగే ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఇప్పటికే చిదంబరాన్ని కలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మధ్యాహ్నం 3 గంటలకు చిదంబరాన్ని కలుసుకోబోతున్నారు. మంగళవారంనాటి చిదంబరం ప్రకటనపై గానీ, అఖిలపక్ష సమావేశంపై గానీ కెసిఆర్ గానీ, ఆ పార్టీ నాయకులు గానీ ఎటువంటి అభిప్రపాయం కూడా ఇప్పటి వరకు వ్యక్తం చేయలేదు. కాలయాపన చేస్తే సహించబోమని మాత్రమే చెబుతున్నారు. చిదంబరంతో భేటీ తర్వాత కెసిఆర్ మీడియాతో మాట్లాడే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications