చిరుకు తాడూ బొంగరం లేదు: డి శ్రీనివాస్

D Srinivas
న్యూఢిల్లీ: తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాదు నుంచి చెన్నైకి తరలిపోతుందనే ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి వ్యాఖ్యలపై ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి శ్రీనివాస్ తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాదులో చిరంజీవికి హైదరాబాదులో తాడు, బొంగరం లేవని ఆయన వ్యాఖ్యానించారు. సినీ పరిశ్రమలోని మిగతావారికి లేని అభ్యంతరాలు చిరంజీవికి ఎందుకని ఆయన బుధవారం అడిగారు. తెలంగాణ ఉద్యమం వల్ల సినీ పరిశ్రమ భయాందోళనలకు గురవుతోందని చిరంజీవి కేంద్ర హోం మంత్రి పి. చిదంబరానికి ఫిర్యాదు చేశారు.

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలనేది మజ్లీస్ వ్యక్తిగత అభిప్రాయమని ఆయన అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొనాలని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై నిర్ణయాన్ని ప్రకటిస్తుందని ఆయన చెప్పారు. చర్చల ప్రక్రియ కొంత కాలం కొనసాగుతుందని, అయితే సాధ్యమైనంత త్వరగా ఆ ప్రక్రియను పూర్తి చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోందని ఆయన అన్నారు. రెండు మూడు నెలల్లో చర్చల ప్రక్రియ పూర్తి కావచ్చునని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+