కెసిఆర్ ను సమైక్యవాదిని చేస్తాం: లగడపాటి రాజగోపాల్

రాష్ట్ర విభజన సమస్య చర్చల ద్వారా పరిష్కారం కాకపోతే రెఫరెండం పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. గత 53 ఏళ్లలో రాయలసీమ, కోస్తా ప్రాంతాల కన్నా తెలంగాణయే ఎక్కువ అభివృద్ధి చెందిందని అందరూ అంగీకరించారని ఆయన అన్నారు. 2009 ఎన్నికల్లో తెలంగాణకు అనుకూలంగా దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి హామీ ఇవ్వలేదని, సోనియా గాంధీ కూడా జై ఆంధ్రప్రదేశ్ అన్నారని ఆయన చెప్పారు. విద్యార్థుల ముసుగులో వేరే వ్యక్తులు మంగళవారం తనపై దాడి చేయడానికి ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. తాను తెలంగాణ విద్యార్థులను తాలిబన్లతో పోల్చలేదని, విద్యార్థులను తాలిబన్లుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారని మాత్రమే అన్నానని ఆయన వివరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications