రాజకీయ పార్టీలకు బుద్ధి రావాలి: కావూరి సాంబశివరావు

Kavuri Sambhasiva Rao
న్యూఢిల్లీ: రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొనాలంటే రాజకీయ పార్టీలుకు బుద్ధయినా రావాలి లేదా కేంద్ర ప్రభుత్వం కఠినంగానైనా వ్యవహరించాలని కాంగ్రెసు కోస్తాంధ్రకు చెందిన పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు అన్నారు. రాష్ట్ర విభజన శాస్త్రీయంగా జరగాలని ఆయన ఒక ప్రైవేట్ టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. రాష్ట్ర విభజనకు సెంటిమెంటును ఆధారంగా తీసుకుంటే దేశం ముక్కలు చెక్కలవుతుందని ఆయన అన్నారు. అది రాష్ట్ర ప్రయోజనాలకే కాకుండా దేశ ప్రయోజనాలకు కూడా ప్రమాదమని ఆయన అన్నారు.

రాష్ట్ర విభజన చేయాలనుకుంటే అన్ని ప్రాంతాలకు చెందిన అన్ని వర్గాలతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల కన్నా తెలంగాణ ప్రాంతమే ఎక్కువ అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. అభివృద్ధి మాట వచ్చే సరికి తెలంగాణ సెంటిమెంటు, ఆత్మగౌరవం గురించి తెలంగాణవాదులు మాట్లాడుతున్నారని, వాటికి విలువ ఇచ్చి రాష్ట్రాన్ని విభజించడం ప్రమాదకరమని ఆయన అన్నారు. అ మాటకొస్తే అందరికీ ఆత్మగౌరవం ఉందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+