తెలంగాణ ఉద్యమం సాగుతుంది: కోదండరామ్

JAC
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం కొనసాగుతుందని తెలంగాణ రాజకీయ పార్టీల సంయుక్త కార్యాచరణ సమితి (జెఎసి) కన్వీనర్ కోదండరామ్ చెప్పారు. తెలంగాణ రాజకీయ పార్టీల జెఎసి సమావేశం అనంతరం ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణపై నిర్దిష్టమైన, స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు విద్యార్థులు శాంతించరని, ఉద్యమం కొనసాగుతుందని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్దిష్టమైన ప్రకటన చేసి కాలపరిమితితో విధాన ప్రకటన చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై రాజ్యాంగ ప్రక్రియ ప్రారంభమయ్యే వరకు ఉద్యమాన్ని శాంతియుతంగా చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ ప్రకటన కోసం వేచి చూస్తామని, అయితే ఉద్యమం మాత్రం ప్రజాస్యామ్యీకరణ పద్ధతిలో సాగుతుందని ఆయన చెప్పారు. హైదరాబాదులో జెఎసి విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించుకుంటామని ఆయన చెప్పారు. శాసనసభ్యుల రాజీనామాల ఆమోదానికి ఒత్తిడి తెచ్చే విషయంపై సదస్సులో చర్చిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో నక్సల్స్ పాత్ర ఉందనే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు తగిన కృషి చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. కాల పరిమితితో కూడిన విధాన ప్రకటన చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏకాభిప్రాయ సాధన అనేది లేదని ఆయన అన్నారు. స్పష్టమైన కాలపరిమితి, లక్ష్యం కోరుతున్నామని ఆయన చెప్పారు.

కేంద్రం ఎవరితో మాట్లాడదలుచుకుంటే వారితో మాట్లాడవచ్చునని ఆయన అన్నారు. తాము గడువు పెట్టడం లేదని, కేంద్రం చెప్పదలుచుకున్నది చెప్పాలని, కేంద్ర ప్రకటన వెలువడిన తర్వాత తాము మాట్లాడుతామని ఆయన చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు స్పష్టమైన ప్రకటన తప్ప తమకు మరోటి అవసరం లేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+