పూర్తి కాలం గవర్నర్ గా నరసింహన్?

కాగా, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక గవర్నర్ గా ఉన్న నరసింహన్ ను పూర్తి కాలం గవర్నర్ గా కొనసాగించే విషయంపై కూడా ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. చత్తీస్ ఘడ్ పరిస్థితుల దృష్ట్యా ఎక్కువ కాలం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా తాత్కాలిక బాధ్యతలు నిర్వహించడం సాధ్యం కాదని నరసింహన్ అభిప్రాయపడితే చత్తీస్ ఘడ్ కు మరో గవర్నర్ ను వేస్తామని చెప్పే అవకాశం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా కొనసాగడానికి నరసింహన్ ఇష్టపడకపోతే మరో రెండు నెలల పాటు కొనసాగాలని అడిగే అవకాశం ఉంది. ఆ తర్వాత రాష్ట్రానికి సమర్ధుడైన ముఖ్యమంత్రిని నియమించే అవకాశం ఉన్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications