చేయి దాటితే రాష్ట్రపతి పాలన: ముఖ్యమంత్రి

ఆందోళనల వల్ల రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మందగించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. ప్రభుత్వాదాయం తగ్గు ముఖం పట్టడం వల్ల పథకాల అమలు కష్టంగా ఉందని ఆయన అన్నారు. తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని అని, తనకు అన్ని ప్రాంతాలు సమానమేనని ఆయన అన్నారు. ఆందోళనల వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం రోజుకు వంద కోట్ల రూపాయలు తగ్గిందని ఆయన చెప్పారు. ఆందోళనల వల్ల పెట్టుబడులు వెనక్కి పోతున్నాయని, దాని వల్ల అభివృద్ధి కూడా కుంటుపడుతోందని ఆయన అన్నారు. రాష్ట్రం నుంచి బయటకు వెళ్లవద్దని సినీ, ఐటి రంగాలను కోరానని, తగిన రక్షణ కల్పిస్తానని భరోసా ఇచ్చానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications