మీడియా ఇష్టారాజ్యం మంచిది కాదు: వీరప్ప మొయిలీ

Veerappa Moily
న్యూఢిల్లీ: మీడియా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరి కాదని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎవరైనా గురువారంనాటి పరిణామాలకు పాల్పడి ఉంటే క్షమార్హం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. వైయస్ రాజశేఖర రెడ్డి మృతి వెనక కుట్ర ఉందని టీవీ చానెళ్లలో కథనాలు ప్రసారం కావడం వల్ల సంభవించిన పరిణామాలపై ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ప్రతిస్పందించారు. ఓ వైబ్ సైట్ లో పెట్టిన కథనాన్ని టీవీ చానెళ్లు ప్రసారం చేయడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఇలాంటి వదంతులు నమ్మి, ప్రజలు విధ్వంసాలకు పాల్పడవద్దని ఆయన విజ్ఝప్తి చేశారు. జర్నలిజంపై తమకు విశ్వాసం ఉందని ప్రజలను తప్పు దోవ పట్టించడం, రెచ్చగొట్టడం సరి కాదని ఆయన అన్నారు.

వార్తా కథనాల ప్రసారం విషయంలో మీడియా సంయమనం పాటించాలని ఆయన కోరారు. మీడియా స్వార్థపూరితంగా, బాధ్యతారహితంగా విధ్వంసాలకు దారి తీసే విధంగా వ్యవహరించవద్దని ఆయన సూచించారు.నిరాధారమైన వార్తలను ఆధారం చేసుకుని సంచలనం సృష్టించడం మంచిది కాదని ఆయన అన్నారు. కీలకమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని ఆయన అన్నారు. రాష్టంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించడం సరైంది కాదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+