వార్తాకథనం ప్రసారం వెనక కుట్ర: రిలయన్స్

Reliance
హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి వెనక తమ కుట్ర ఉందంటూ తమపై దుష్ప్రచారం చేయడం వెనక ప్రత్యర్థుల కుట్ర ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) విమర్శించింది. పాత్రికేయ విలువలను గాలికి వదిలి ద్రోహ చింతనతోనే విద్వేష ప్రచారం చేశారని ఆర్ఐఎల్ విమర్శించింది. ఈ మేరకు రిలయన్స్ గురువారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. వార్తా కథనం ప్రసారం చేసిన టీవీ 5 చానెల్ తో తమ ప్రత్యర్థులు చేతులు కలిపారని ఆరోపించింది. ఈ సంఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేసింది. వైయస్ మరణం అందరి లాగే తమకు దిగ్భ్రాంతి కలిగించిందని, వైయస్ మీద తమకు అపార గౌరవం ఉందని స్పష్టం చేసింది.

టీవీ 5 కథనం ప్రసారమై నిమిషాల్లోనే ప్రణాళికాబద్దందా తమ సంస్థలపై దాడులు జరిగాయని చెప్పింది. ప్రణాళికాబద్దంగానే తమ సంస్థలపై, సిబ్బందిపై దాడులు జరిగాయని ఆరోపించింది. ఆ టీవీ చానెల్ పై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తమపై చేసిన కుట్ర వెనక దాగి ఉన్నవారిని న్యాయస్థానం ముందుకు తేవాలని రిలయన్స్ డిమాండ్ చేసింది. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి పెట్టుబడులు పెట్టిన తమపై టీవీ 5 పాత్రికేయ విలువలను గాలికి వదిలేసి విషప్రచారానికి ఒడిగట్టిందని విమర్శించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+