హైదరాబాద్: ఆర్టీసి బస్సు చార్జీల పెంపు విషయంలో ఏకపక్షంగా వ్యవహరించడమే కాకుండా ముఖ్యమంత్రి కె. రోశయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసి) మేనేజింగ్ డైరెక్టర్ పై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆయనపై బదిలీ వేటు పడింది. ఆయనను రోడ్ సేఫ్టీ అథారిటీకి బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రిపై యాదవ్ అనుచిత వ్యాఖ్యల మీద విచారణకు కమిటీ వేసింది. చార్జీలపై ఏకపక్ష నిర్ణయానికి ఆయనపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. యాదవ్ వ్యాఖ్యలపై రవాణా శాఖ కార్యదర్శి రత్నప్రభ విచారణ జరుపుతున్నారు.