వైయస్ జగన్ పద్ధతేం బాగా లేదు: వి హనుమంతరావు

V Hanumantha Rao
న్యూఢిల్లీ: వైయస్ మరణం వార్తా కథనం ప్రసారం వల్ల తలెత్తిన విధ్వంసం విషయంలో తమ పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వ్యవహారశైలిని కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు తప్పు పట్టారు. వార్తా కథనం 7 గంటలకు ప్రసారమైతే వైయస్ జగన్ రాత్రి 11 గంటల తర్వాత శాంతి ప్రకటన చేశారని, వార్తా కథనం ప్రసారమైన వెంటనే శాంతిప్రకటన చేసి ఉండాల్సిందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. విధ్వంసమంతా జరిగిన తర్వాత జగన్ శాంతి ప్రకటన చేయడం సరైంది కాదని ఆయన అన్నారు. ప్రతిపక్షాల నాయకులు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాంగ్రెసుపై విమర్శలు చేయడానికి కాంగ్రెసువారే అవకాశం కల్పిస్తున్నారని ఆయన విమర్శించారు. టీవీ చానెళ్లపై చర్య తీసుకోవాలని తాను కేంద్ర మంత్రి అంబికా సోనీని కోరుతానని ఆయన చెప్పారు.

గ్యాస్ తవ్వకాలకు మాత్రమే ప్రైవేట్ సంస్థలు పరిమితమవుతాయని, గ్యాస్ కేటాయింపులు కేంద్ర ప్రభుత్వమే చేస్తుందని, ఈ విషయం తెలియకుండా వార్తాకథనాలు ప్రసారం చేశారని ఆయన అన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా లైవ్ చానెళ్లు పెట్టి ప్రజలను రెచ్చగొడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. తమకు ప్రచారం అక్కర్లేదని, ప్రజలను రెచ్చగొట్టే ప్రసారాలు చేయవద్దని ఆయన మీడియాకు సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సోనియా గాంధీ, చిదంబరం కట్టుబడి ఉన్నారని తెలిసి తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవడానికి వైయస్ మరణ కథనాన్ని ప్రసారం చేశారని ఆయన విమర్శించారు. శాంతిభద్రతల సమస్య సృష్టించి రాష్ట్రపతి పాలన రావాలని చూస్తున్నారని, తమ పార్టీవారే రాష్ట్రపతి పాలన విధించాలని అంటున్నారని, రాష్ట్రపతి పాలన వస్తే తెలంగాణ ఏర్పాటు వెనక్కి పోతుందని వారు భావిస్తున్నారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+