బంధువు సాయంతో భర్తను కడతేర్చిన భార్య

Krishna Dist
మచిలీపట్నం‌: మద్యానికి బానిసై రోజూ వేధించే భర్తతో గొడవ పడి అతన్ని మరొకరి సాయంతో కడతేర్చిన ఓ ఇల్లాలి ఉదంతం ఇది. నిందితురాలు పోలీసుల అదుపులో ఉండగా, ఆమెకు సహకరించిన మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కోడూరు పంచాయతీ దళిత కాలనీకి చెందిన చెరుకూరు సుబ్బయ్య (50) బేల్దారి పని చేస్తూ జీవించేవాడు.

మద్యానికి బానిసై భార్య మస్తానమ్మను రోజూ వేధిస్తూ గొడవపడేవాడు. ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి సుబ్బయ్య హత్యకు గురయ్యాడు.. హతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సై నరసింహారెడ్డి తన సిబ్బందితో గురువారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతుని శరీరంపై ఉన్న రక్తపు మరకలు, ఆనవాళ్లను బట్టి పిడిగుద్దులతో గొంతు నులిమి చంపినట్లుగా పోలీసుల విచారణలో నిర్థారణ అయింది. శవ పంచనామా నిర్వహించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

మద్యానికి బానిసై రోజూ పెట్టే చిత్రహింసలు భరించలేకే తన భర్తను హత్య చేసినట్లు నిందితురాలు మస్తానమ్మ తెలిపింది. ఆమె సంఘటనా స్థలంలో విలేకరులతో మాట్లాడుతూ రోజులాగే బుధవారం రాత్రి కూడా మద్యం మత్తులో తనపై దాడి చేశాడని, ఆ దాడికి ప్రతిదాడిగానే తన భర్తపై దాడి చేశానంది. తాను తన భర్తను చంపాలని అనుకోలేదని, మా ఇరువురి మధ్య జరిగిన ఘర్షణలోనే అతను ప్రాణాలు కోల్పోయాడని తెలిపింది. తనను రక్షించాలని వచ్చి హత్యానేరంలో చిక్కుకున్నతన సమీప బంధువు బంధువు మల్లికార్జునను విడిచి పెట్టాలని నిందితురాలు వాపోవడం గమనార్హం.

కోడూరులో జరిగిన హత్యకేసులో మరో నిందితుడు మల్లికారునను త్వరలోనే పట్టుకొంటామని రూరల్‌ సీఐ జయరామ సుబ్బారెడ్డి తెలిపారు. గురువారం మధ్యాహ్నం ఆయన సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలను సేకరించారు. హత్యకేసులో ప్రధాన నిందితురాలు మస్తానమ్మను విచారించి హత్యకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+