వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాజీనామాల ఉపసంహరణకు డి శ్రీనివాస్ ఒత్తిడి

గత రెండు రోజులుగా శ్రీనివాస్ పార్టీ శాసనసభ్యులకు ఎస్ఎంఎస్ లు పంపుతూ రాజీనామాలు ఉపసంహరించుకోవాలని పార్టీ శాసనసభ్యులకు సూచిస్తున్నారు. శాసనసభ్యులకు ఆయన ఫోన్ లు కూడా చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొన్న తర్వాతనే రాష్ట్ర విభజనపై తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం అన్ని పార్టీలకు చెప్పింది. దీంతో తొలుత కాంగ్రెసు శాసనసభ్యుల చేత రాజీనామాలు ఉపసంహరింపజేయాలనే ఆలోచనలో కూడా అధిష్టానం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెసు శాసనసభ్యులు సోమవారం హైదరాబాదులో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ కోసం గట్టిగా పట్టుపడుతున్న మాజీ మంత్రి ఆర్ దామోదర్ రెడ్డి సోమవారం హైదరాబాదు వచ్చారు.