హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ నటించిన అదుర్స్ సినిమా ప్రదర్శనను అడ్డుకోవద్దని మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్ తెలంగాణవాదులకు విజ్ఢప్తి చేశారు. అదుర్స్ సినిమా ప్రదర్శనను తెలంగాణలో అడ్డుకుంటామని తెలంగాణ జాగృతి అధినేత, విద్యార్థి నాయకులు హెచ్చిరించిన నేపథ్యంలో ఆయన ఆ విజ్ఞప్తి చేశారు. రాజకీయాలకు, సినిమాలకు ముడిపెట్టవద్దని ఆయన ఒక ప్రైవేట్ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు.
అదుర్స్ సినిమాను తెలంగాణలో ఆడనివ్వబోమని ఆందోళనకారులు ప్రకటించడం విచారకరమని ఆయన అన్నారు. అదుర్స్ సినిమా విడుదలకు సహకరించాలని ఆయన కోరారు. తెలంగాణపై మాట్లడకూడదని చిత్రపరిశ్రమలోని వారందరికీ తమ సంఘం విజ్ఞప్తి చేసిందని ఆయన చెప్పారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి