వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
టీవి5 జర్నలిస్టులకు బెయిలు మంజూరు

వైయస్ రాజశేఖర రెడ్డి మృతికి సంబంధించి విచారణ పూర్తయ్యేంత వరకు ఏ విధమైన వార్తాకథనాలు ప్రసారం చేయకూడదని, విచారణపై కూడా ఏ విధమైన వార్తా కథనం ప్రసారం చేయకూడదని కోర్టు వారికి షరతులు పెట్టింది. కాగా, కోర్టు ఆదేశాలు చంచల్ గుడా జైలుకు సాయంత్రం ఆరు గంటలలోగా అందితే వారిద్దరు సోమవారం సాయంత్రం విడుదలవుతారు. లేదంటే వారి విడుదల రేపటికి వాయిదా పడవచ్చు. రష్యన్ వెబ్ సైట్ ది ఎగ్జైల్డ్ వార్తాకథనం ఆధారంగా టీవీ5తో పాటు మరో రెండు టీవీ చానెళ్లు వైయస్ మృతికి కుట్ర జరిగిందనే వార్తాకథనాన్ని ప్రసారం చేశాయి. ఈ కేసులో టీవీ5 జర్నలిస్టులపై కేసు నమోదు చేసి సిఐడి పోలీసులు వారిని అరెస్టు చేశారు.