హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ నటించిన అదుర్స్ సినిమా మరో వివాదంలో చిక్కుకుంది. అదుర్స్ సినిమా కథ తనదేనని రాంరెడ్డి అనే కరీంనగర్ కు చెందిన విద్యార్థి చెబుకుంటున్నాడు. ఇందుకు సంబంధించిన వార్తా కథనాన్ని ఒక తెలుగు టీవీ చానెల్ మంగళవారం ప్రసారం చేసింది. ఈ కథను తాను జూనియర్ ఎన్టీఆర్ కు విపించినట్లు రాంరెండ్డి చెప్పుకున్నాడు. సినిమాలంటే తనకు ఎంతో ఇష్టమని, సినిమాల్లోకి ప్రవేశించాలనేది తన కోరిక అని, దాంతో తాను కథ రాసి జూనియర్ ఎన్టీఆర్ కు వినిపించానని అతను చెబుతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి తాను తీసుకున్న ఫొటోను, కథ రాతప్రతులను అతను ప్రదర్శించాడు.
జూనియర్ ఎన్టీఆర్ మంగళవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. పంచెకట్టు, తిరునామంతో ఆయన ప్రత్యేకంగా కనిపించారు. అదుర్స్ సినిమాకు ఆటంకాలు తొలగించాలని సినిమా యూనిట్ సభ్యులు వేంకటేశ్వరస్వామిని వేడుకున్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి