హైదరాబాద్: అరుదైన కంకణాకార సంపూర్ణ సూర్యగ్రహణం ఈ నెల 15న కనుమ పండుగనాడు ప్రజలకు కనువిందు చేయనుంది. ఈ దశాబ్ది ప్రారంభంలోనే వస్తున్న ఈ సూర్యగ్రహణం, ఎక్కువ సేపు ఏర్పడుతోంది. మూడు వేల ఏళ్లలో ఇదే దీర్ఘకాల గ్రహణంగా పేర్కొంటున్నారు. సూర్యుడిని చంద్రుడు 92 శాతం కప్పివేయనున్నాడు. ఈ సమయంలో సూర్యుడు ఒక గాజు కంకణంలాగా మెరుస్తూ దర్శనమివ్వనున్నాడు. ఈ అరుదైన దృశ్యాన్ని దేశం దక్షిణాగ్ర భాగమైన కన్యాకుమారి నుంచి మాత్రమే పూర్తిగా వీక్షించ వచ్చు.
మొత్తంగా 11నిముషాల పాటు సూర్యుడు కంకణంలా మెరిసిపోతూ దర్శమిస్తాడని బిర్లా సైన్స్ సెంటర్ ఒక ప్రకటనలో పేర్కొంది. హైదరాబాద్ లో పాక్షికంగానే ఈ గ్ర హణం కనిసిస్తుందని తెలిపింది. భారత కాలమానం ప్రకారం 15వ తేదీ ఉదయం 11.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ గ్రహణం.. మధ్యాహ్నం 1.32 గంటలకు పూర్తి స్థాయిలో ఏర్పడి చీకటి పడుతుంది. మధ్యాహ్నం 3.15 గంటలకు ముగుస్తుంది. ఈ గ్రహణాన్ని బైనాక్యులర్స్, టెలిస్కోప్‌లు, సూక్ష్మ ద్వారం గల కెమెరాల ద్వారా వీక్షించవచ్చు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి