కరీంనగర్: దుబాయ్ లో ఇద్దరు కరీంనగర్ జిల్లా వాసులు మరణించారు. దుబాయ్ లోని పెట్రోల్ బావి వద్ద సంభవించిన పేలుడులో వీరు మరణించారు. మరో ఇద్దరు గాయపడినట్లు సమాచారం. కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన రాజు, జగిత్యాలకు చెందిన తిరుపతి ఈ ప్రమాదంలో మరణించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో ఈ కుటుంబాలు విషాద సముద్రంలో మునిగిపోయాయి.
మృతదేహాలను స్వస్థలాలకు తేవడానికి సాయం చేయాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వారి మరణానికి సంబంధించిన సమాచారాన్ని అక్కడి సంస్థ ఇక్కడికి చేరవేసింది. దుబాయ్ లో కరీంనగర్ జిల్లాకు చెందిన కూలీలు చాలా మంది పనిచేస్తున్నారు. వారి దుస్థితి పట్ల ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి వివిధ రాజకీయ పార్టీలు మొర పెట్టుకుంటూనే ఉన్నాయి.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి