వరంగల్: నగరంలో పలు చోట్ల కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ దిష్టి బొమ్మను దహనం చేశారు. తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ ఉండవల్లిపై వివిధ పార్టీలు మండి పడ్డాయి, దిష్టిబొమ్మలను దహనం చేశాయి. సీపీఐ, టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి.
సీపీఐ నగర కమిటీ సోమ వారం నగరంలోని హెడ్ పోస్టాఫీస్ సెంటర్‌లో కాంగ్రెస్ ఎంపీలు ఉండవల్లి అరుణ్‌కుమార్, కావూరి సాంబశివరావుల దిష్టిబొమ్మలను దహనం చేసింది. ఉండవల్లి, కావూరికి పిచ్చి పట్టిందని, తెలంగాణ ప్రజల మనోభావాలను కించ పరిచే విధంగా మాట్లాడితే ఖబడ్దార్ అంటూ కార్య కర్తలు నినాదాలు చేశారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి