వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాజీనామాలు వెనక్కి తీసుకోండి: వి హనుమంతరావు

రోశయ్యను దించి రాష్ట్రపతి పాలనను ఆహ్వానించడానికి ఓ వర్గం సిద్ధంగా ఉందని, రాష్ట్రపతి పాలన వస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో మరింత జాప్యం జరుగుతుందని ఆయన అన్నారు. తెలంగాణ వస్తుంది కాబట్టి తెలంగాణ ప్రజాప్రతినిధులు రాజీనామాలు ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. తెలంగాణ కోసం 50 ఏళ్ల వేచి చూశామని, మరికొంత కాలం వేచి ఉందామని ఆయన తెలంగాణ ప్రజాప్రతినిధులను ఉద్దేశించి అన్నారు. తెలంగాణ నేతకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు కాంగ్రెసు కోస్తాంధ్ర పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు చేసిన వ్యాఖ్యను ఆయన ఖండించారు. తమ ఆందోళన పదవుల కోసం కాదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమని ఆయన అన్నారు.