కృష్ణా జిల్లాలో సమైక్యాంధ్ర భోగిమంటలు

Krishna Dist.
మచిలీపట్నం: సమైక్యాంధ్ర ఉద్యమానికి సంక్రాంతి పండగ కూడా వేదికైంది. మచిలీపట్నం పురపాలక సంఘ పరిధిలోని పలుప్రాంతాల్లో ప్రజలు జై సమైక్యాంధ్ర అనే నినాదాల మధ్య బుధవారం తెల్లవారుజామున భోగిమంటలు వేశారు. తెలంగాణ వేర్పాటు వాదం భోగిమంటల్లో కలిసిపోవాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. పిల్లలు, పెద్దలు జై సమైక్యాంధ్ర అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లతో పాటు పలు సందుల్లో ఈ భోగిమంటలను వేశారు. 15వ వార్డు కౌన్సిలర్‌ లంకిశెట్టి వనజ ఆధ్వర్యాన స్థానిక జగన్నాధపురంలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద భోగిమంటలను వేశారు.

ఈ సందర్భంగా వార్డులోని ప్రజలు సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ లీగల్‌సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి లంకిశెట్టి బాలాజీ, టీడీపీ నాయకులు మాదిరెడ్డి అంజిబాబు, ఎస్‌బీహెచ్‌ మేనేజరు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే సమైక్యాంధ్రా జెండాను టీడీపీ నాయకుడు అంజిబాబు కుమారుడు మాదిరెడ్డి శ్రీశైలేష్‌ చేత పట్టుకుని భోగిమంటల వద్ద ప్రదర్శించడం పలువుర్ని ఆకర్షించింది. పెడనలో మహిళలు తమ ఇళ్ల ముందు సమైక్యాంధ్ర ముగ్గులు వేసి ఆంధ్రులందరూ కలసి ఉండాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+