విశాఖపట్నం: ఇప్పటివరకు విశాఖకు ఉన్న ఖ్యాతి మరో సింగపూర్ అని. సింగపూర్ కు విశాఖకు అనేక విషయాల్లో పోలిక ఉంది. కానీ ఇప్పుడు విశాఖ ఆ స్ధాయిని కూడా దాటిపోయే ప్రపంచంలోనే రెండో సుందర నగరం అనే క్రెడిట్ ను కొట్టేయనుందని తెలిసింది. బ్రెజిల్ దేశానికి చెందిన రియోడియో జెన్యారో నగరం ప్రపంచంలోని తొలి అందమైన నగరంగా ఎంపికైంది. ఆ తర్వాత 40 కిలోమీటర్లు పొడవునా సముద్రతీర ప్రాంతం, ఎత్తయిన కొండలు, పచ్చని ప్రకృతి గల విశాఖ నగరం రెండో స్థానం దక్కించుకోనున్నది. అనేక అంతర్జాతీయ సదస్సుల్లో విశాఖ నగరం పేరు మారుమోగింది.
సువిశాల సముద్ర తీరం, పచ్చని కొండలు మరెక్కడా లేవని పలు అంతర్జాతీయ సదస్సుల్లో విశాఖ ఖ్యాతిని అదరగొడుతున్నారు. ఇందుకు సంబంధించి తాజాగా జరిగిన సదస్సులో విశాఖ అందచందాలపై పవర్ ప్రజంటేషన్ కూడా చూపించారు. రాష్ట్రంలో నంబర్ వన్ గ్రీన్‌సిటీ... 00 రాష్ట్రంలో 19 శాతం గ్రీన్ కవర్(ఫారెస్టు) సిటీగా విశాఖ నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. 5 శాతం గ్రీన్ కవర్ (ఫారెస్టు) సిటీగా హైదరాబాద్ రెండో స్థానంతో సరిపెట్టుకుంది. విశాఖ చుట్టూ ఉన్న గ్రీన్ ఫారెస్ట్ వల్ల ఈ ఖ్యాతి దక్కనుంది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి